మా నాన్నకి ఆ పిచ్చి ఉండేది.. అసలు విషయం చెప్పిన అనసూయ

ENTERTAINMENT

 

తాజాగా అనసూయ తన తండ్రి గురించి కొన్ని విషయాలను చెప్పుకొచ్చారు. మేం రిచ్‌గానే పెరిగాం. ఈ విషయం ఇంత వరకు ఎక్కడా చెప్పలేదు. మాకు గుర్రాలు ఉండేవి.. మా నాన్నకు గ్యాంబ్లింగ్ పిచ్చి కూడా ఉండేది.. అలా మా ఆస్తిపోయిందంటూ అనసూయ చెప్పుకొచ్చారు.

 

 

బుల్లితెరపై యాంకర్‌గా, వెండితెరపై నటిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నారు. ఇక సోషల్ మీడియాలో అనసూయ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనేలేదు. ఆమె ఏం చేసినా కూడా ఓ సెన్సేషన్ అవుతుంది. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారే అనసూయ.. ట్రోలర్లకు దిమ్మతిరిగే కౌంటర్లు ఇస్తుంటారు. ఎక్కువగా మీడియా ముందుకు రాని అనసూయ తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో అనేక విషయాలను పంచుకున్నారు.

 

 

అనసూయ తన వ్యక్తిగత జీవితం గురించి ఇది వరకే ఎన్నో సార్లు స్ఫష్టంగా చెప్పారు. అమ్మానాన్నలు, చెల్లెళ్లు, భర్త గురించి ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు. మరీ ముఖ్యంగా తన తొమ్మిదేళ్ల ప్రేమ వ్యవహారం, ఆ విషయం తన తండ్రికి తెలియకుండా ఉండటం, చివరకు ఇంట్లో నుంచి బయటకు రావడం ఇలా అన్ని విషయాలు అనసూయ ఎప్పుడో వివరించారు.

 

 

అయితే అనసూయ చిన్నతనంలో ఎన్నో కష్టాలు పడ్డానని చెప్పుకొచ్చారు. అద్దె ఇంట్లో ఉండేవాళ్లమని, డబ్బులు సరిపోకపోతే బస్టాప్ వరకు నడుచుకుంటూ వెళ్లేదాన్ని అని అనసూయ వివరించారు. అంతేకాకుండా తన తండ్రి గురించి చెబుతూ తమను ఎలా పెంచారో కూడా చెప్పుకొచ్చారు. స్వతంత్రంగా, ధైర్యంగా ఉండాలని చెప్పేవారని, ఆటో వాళ్లతో ఎలా మాట్లాడుతామో, ఎలా హ్యాండిల్ చేస్తామో అని దూరం నుంచి ఓ కంట కనిపెడుతుండే వారని ఆ మధ్య అనసూయ చెప్పుకొచ్చారు.

 

 

తాజాగా అనసూయ తన తండ్రి గురించి కొన్ని విషయాలను చెప్పుకొచ్చారు. మేం రిచ్‌గానే పెరిగాం. ఈ విషయం ఇంత వరకు ఎక్కడా చెప్పలేదు. మాకు గుర్రాలు ఉండేవి.. మా నాన్నకు హార్స్ రేసింగ్, గ్యాంబ్లింగ్ పిచ్చి కూడా ఉండేది.. అలా మా ఆస్తిపోయిందంటూ అనసూయ చెప్పుకొచ్చారు.

 

 

అనసూయ ఇప్పుడు ఐదారు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. కోలీవుడ్, మాలీవుడ్, టాలీవుడ్ అంటూ బిజిబిజీగా తిరుగుతున్నారు. రేపు థ్యాంక్యూ బ్రదర్ అనే సినిమాతో ఆహాలో అనసూయ సందడి చేయబోతోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *