మంచు మ‌నోజ్ చిత్రంలో మెగా హీరో గెస్ట్ రోల్‌?

ENTERTAINMENT

 

మంచు హీరోల‌కు, మెగా హీరోల‌కు మధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయి. గ‌తంలో మెగాస్టార్ క‌లెక్ష‌న్‌కింగ్ మోహ‌న్‌బాబు క‌లిసి న‌టించిన చిత్రాలు సూప‌ర్ హిట్‌లుగా నిలిచాయి. ఆ త‌రువాత బ‌న్నీతో క‌లిసి మంచు మ‌నోజ్ న‌టించిన `వేదం` మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుని విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే.

 

 

మ‌రోసారి మంచు హీరో, మెగా హీరో క‌ల‌బోతున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. కొంత విరామం త‌రువాత మంచు మ‌నోజ్ హీరోగా న‌టిస్తున్న చిత్రం మంచు మ‌నోజ్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై శ్రీ‌కాంత్ ఎన్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న చిత్ర‌మిది. మంచు నిర్మ‌లా దేవి, మంచు మ‌నోజ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది.

 

 

ఇందులో మంచు మ‌నోజ్ విభిన్న‌మైన లుక్‌లో క‌నిపించ‌బోతున్నారు. ఈ చిత్రంలోని ఓ కీల‌క అతిథి పాత్ర‌లో మెగా హీరో సాయి ధ‌ర‌మ్‌తేజ్ న‌టించనున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. గ‌త కొంత కాలంగా మంచు మ‌నోజ్‌తో సాయి ధ‌ర‌మ్‌తేజ్ కు మధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయి. ఆ కార‌ణంగానే సాయి ధ‌ర‌మ్‌తేజ్ ఈ చిత్రంలోని అతిథి పాత్ర‌లో న‌టించ‌డానికి అంగీక‌రించార‌ని వినిపిస్తోంది. ఇందులో నిజ‌మెంత అన్న‌ది తెలియాలంటే మంచు మ‌నోజ్ అధికారికంగా ప్ర‌క‌టించే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *